దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ అయిన ఓలా నాలుగు ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను విడుదల చేసింది. తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో జరిగిన కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. కంపెనీ బ్యాటరీతో నడిచే స్కూటర్ S1X ధరను రూ.89,999గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అనేక కంపెనీల ద్విచక్ర వాహనాల ధరలతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉన్నాయి. వీటి విక్రయాలు డిసెంబర్ లో ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం ఉన్న వాహనాలకు ధీటుగా వీటిని తయారుచేయడమే తమ లక్ష్యమని , ఆ దిశగా పురోగతి సాధించామని కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అన్నారు. వీటి వినియోగం తరువాత దేశంలో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు ఎవరు ఉపయోగించరని తాను భావిస్తున్నానన్నారు.
Also Read: Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జన గణ మణ… వింటే గూస్ బంప్సే
ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్వహణ కూడా చాలా తక్కువగా ఉండడంతో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే చాలా మంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పట్ల ఆసక్తి కనబరుసున్నారు. ఇప్పటికే చాలా మంది వీటిని బుక్ చేసుకున్నారు. తక్కువ ధరకే వీటిని అందిస్తున్నా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇవి కనుక అందుబాటులోకి వచ్చి పర్ఫార్మన్స్ బాగుంటే ప్రెటోల్ సూటర్ల అమ్మకాలు భారీగా పడిపోయే అవకాశం ఉంది.