స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.