ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి.