India Strongly Condemns: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్‌పై చేసిన అణుబాంబు బెదరింపు వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్థాన్‌కు పాత అలవాటని, ఇలాంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం స్వయంగా చూస్తుందని అన్నారు. ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కైన దేశాన్ని.. అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతలో విశ్వసించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. READ MORE: Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా? బెదిరింపులకు తలవంచేది లేదు.. పాకిస్థాన్…
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)…