టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ కు ఆయన కూతురు అంటే ఏంటో మమకారం. చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగ పెంచారు రాజేంద్రప్రసాద్. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ” నా పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయారు. అప్పటి నుండి తన తల్లిని తన కూతురిలో చూసుకున్నాను” అని అన్నారు. గద్దె గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మధ్య కొన్నాళ్లు రాజేంద్రప్రసాద్ కు దూరంగా ఉన్న కూతురు మళ్ళి తండ్రితో పాటుగా ఉంటున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆయనను విడిచి వెళ్లిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు.