Rajasaab : సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే జోరును కొనసాగిస్తూ… టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో ఇంత వరకు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ “రాజా సాబ్” సినిమా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మారుతి. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానులకు తెగ నచ్చేసింది. అయితే తాజాగా చిత్రబృందం నుండి వచ్చిన అప్‌డేట్ అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది.
Read Also:Off The Record: సడన్‌గా జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు..! ఇది ప్రమోషనా? డిమోషనా?
ఈ సినిమాలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో పూర్తికానుందని సమాచారం. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ త్వరలో చేయబోయే ఫౌజీ, సలార్ 2, స్పిరిట్, కల్కి పార్ట్ 2 చిత్రాలను పూర్తి చేసే ఛాన్స్ ఉంది.
Read Also:PM Modi: పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారింది
మాస్ హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. అదే ముగ్గురు హీరోయిన్లు నటిస్తే డాల్బీ అట్మాస్ థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. అలాంటి సందడి ‘ది రాజా సాబ్’లో ఉంటుంది. ప్రభాస్ మాస్ ఇమేజ్, మారుతి కామెడీ స్టైల్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే క్షణాలకే పరిమితం కాలేదు. అందుకే ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. అందులో ఒక స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ప్రభాస్ స్టైలిష్ డ్యాన్స్ చూసి చాలా రోజులైంది. ఆ లోటు ‘రాజా సాబ్’తో తీరబోతోంది. ఇందులో నిధి అగర్వాల్, రిద్దికుమార్, మాళవిక మోహనన్ ముగ్గురితో ఆడిపాడేలా ప్రభాస్ కోసం ఓ పాటను డిజైన్ చేశారు. ఈ పాట థియేటర్లను ఓ ఊపు ఊపేయనుందన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్‌తో మాస్సే స్టెప్పులు వేయించాలనే లక్ష్యంతో మారుతీ ఈ పాటను డిజైన్ చేశారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు డ్యాన్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ జనరేషన్‌లో ఏ హీరోకి అవకాశం రాలేదనే చెప్పాలి.ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.