Gautam Gambhir showed favoritism in IND vs SL Squad: శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం. చాలామంది స్టార్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. దాంతో భారత జట్టు ఎంపికలో ప్రధాన పాత్ర వహించిన గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
జింబాంబ్వే పర్యటనలో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ మాదిరి.. ఓపెనర్ స్థానం సహా వన్‌డౌన్‌లో ఆడే గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడం విశేషం. గత 7 టీ20 ఇన్నింగ్స్‌ల్లో రుతురాజ్ 71 సగటుతో, 158 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. వన్డేల్లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, పేసర్ హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. గత కొంత కాలంగా జట్టులో లేని శ్రేయాస్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుందని తెలుస్తోంది. ఇందుకు కారణం గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఐపీఎల్ 2024లో కోల్‌కతాకు మెంటార్‌గా గంభీర్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
Also Read: IND vs SL: భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ ప్లేయర్ల జాబితా ఇదే!
భారత జట్టు విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కోల్‌కతాపై ప్రేమను, చెన్నైపై ద్వేషంను చూపించాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి ప్రదర్శన కారణంగానే చెన్నై ఆటగాడు శివమ్ దూబె విషయంలో గౌతీ ఏమీ చేయలేకపోయాడని అంటున్నారు. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై గంభీర్ ఎప్పటికప్పుడు అసహనం వ్యక్తం చేస్తాడన్న విషయం తెలిసిందే. మొత్తానికి కోల్‌కతాపై ఫేవరిటిజం చుపించాడు అని విమర్శలు చేస్తున్నారు.