Dale Steyn React on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్‌మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్‌క్రమ్ మినహా ఎవరూ…
Rohit Sharma Capain Record in Cape Town: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది రెండోసారి. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది.…
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6…
KL Rahul React on Shortest Test in Cricket History at Cape Town: కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు మొహ్మద్ సిరాజ్ (6/15), జస్ప్రీత్ బుమ్రా (6/61) చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 153…
Jasprit Bumrah Wins Player of the Series award on South African Soil: 18 నెలల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్స్ పడగొట్టాడు. దాంతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. కేప్ టౌన్ టెస్టులో 8 వికెట్స్ తీశాడు.…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాదు కేప్‌టౌన్‌లో తొలి టెస్టు విజయాన్ని భారత్ నమోదు చేసింది. భారత్ విజయంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు. మొత్తంగా రెండో టెస్టులో సిరాజ్ 7 వికెట్లు,…
Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో ఆఖరి టెస్ట్ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్స్ అందించారు.…
WTC Points Table 2025 Latest: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏకంగా ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు చేరింది. భారత జట్టు పాయింట్ల శాతం 54.16గా ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్లో…
Rohit Sharma on Cape Town Pitch: భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్…
తన హృదయంలో కేప్‌టౌన్ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ ఇంత తొందరగా ముగుస్తుందని తాను ఊహించలేదని, టెస్టు క్రికెట్ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని బుమ్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా (6/61) ప్రొటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు…