IND vs ENG ODI World Cup Records: ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లపైనే కాకుండా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను కూడా మట్టికరిపించింది. ఇక నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో చెత్త ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ దాదాపుగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటివరకు తన స్థాయికి తగ్గట్టు ఆడని ఇంగ్లండ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే రికార్డులు మాత్రం ఇంగ్లండ్‌పై గెలవడం భారత్‌కు కష్టమే అని చెబుతున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లలో భారత్, ఇంగ్లండ్ చరిత్ర పరిశీలిస్తే.. టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదు. ఇంగ్లండ్‌ను ప్రపంచకప్‌లలో భారత్ ఓడించి ఏకంగా 20 ఏళ్లు అవుతోంది. చివరగా 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టును టీమిండియా ఒక్కసారి కూడా ఓడించలేదు. అంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై భారత్ పైచేయి సాధించలేదు. ఈ రికార్డ్స్ ఇప్పుడు టీమిండియాను కలవరపెడుతున్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Virat Kohli: టీమిండియాకు ఈసారి విరాట్ కోహ్లీ ప్రపంచకప్ అందిస్తాడు.. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు!
భారత్, ఇంగ్లండ్ రికార్డ్స్:
1975 ప్రపంచకప్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
1983లో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది.
1987లో 35 పరుగులతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది.
1992లో 9 పరుగుల తేడాతో టీమిండియాను ఇంగ్లీష్ జట్టు ఓడించింది.
1999లో 63 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించింది.
2003లో 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది.
2007లో ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడలేదు.
2011లో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ టై అయింది.
2019లో భారత్‌ను 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడించింది.