ఇంగ్లండ్ ఎలాంటి బౌలింగ్ చేస్తుందని, వారి బ్యాటింగ్ ఎలా ఉంటుందనే దానిపై తాను పెద్జగా దృష్టి సారించనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాము ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి సారిస్తామన్నాడు. కేప్‌టౌన్‌లో ఆడిన వాతావరణం వేరని, హైదరాబాద్ వాతావరణం వేరని రోహిత్ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా గురువారం (జనవరి 25) నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు.
‘టీమ్‌గా మేము ఎలా ఉండాలనే దానిపై దృష్టి సారించాము. ప్రత్యర్థి టీం ఎవరనే దానిపై కాదు. ఇంగ్లండ్ ఎలాంటి బౌలింగ్ చేస్తుంది, వారి బ్యాటింగ్ ఎలా ఉంటుందనే దానిపై నేను పెద్జగా దృష్టి సారించను. తాము జట్టుగా ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి పెడుతా. ఇటీవల కేప్‌టౌన్‌లో ఆడిన వాతావరణం వేరు, హైదరాబాద్ వాతావరణం వేరు. కేప్‌టౌన్‌లో ఆడిన మ్యాచ్ మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మొదటిసారి ఇండియాలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఇది చాలెంజింగ్‌గా ఉంది. స్వీప్, రివర్స్ స్వీప్ ఏదైనా సరే ఎలాంటి షాటైనా ఆడటానికి ప్లేయర్స్ సిద్ధంగా ఉన్నాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read: Assam Jawan Fires: సహచరులపై జవాన్ కాల్పులు.. ఆరుగురికి గాయాలు! చివరకు
‘ఉప్పల్ పిచ్ చాలా బాగుంది. జట్టుకు ఏది కరెక్టు అనిపిస్తే అది చేస్తాం. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. క్రికెటర్‌గా టెస్ట్ మ్యాచ్ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. బెస్ఠ్ క్రికెట్ ఆడాలని ప్రతి ప్లేయర్ ప్రయత్నిస్తాడు. కుల్దీప్ యాదవ్ బాగా బౌల్ చేస్తాడు. పిచ్ మీద బౌన్స్ ఉన్నా, లేకున్నా బౌలింగ్ చేయగలడు. అతడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అక్షర్ పటేల్ మంచి ఆల్ రౌండర్. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి సెలెక్ట్ చేయాలనేది పెద్ద చాలెంజ్’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.