ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్దమవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ జనవరి 25న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో కఠోర సాధన చేస్తున్నాయి. తమ బాజ్‌బాల్ సిద్ధాంతంతోనే టీమిండియాపై పైచేయి సాధించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయితే బాజ్‌బాల్ భారత పిచ్‌లపై పెద్దగా ప్రభావం చూపదని మాజీలు అంటున్నారు. దీనిపై తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. బాజ్‌బాల్ అప్రోచ్ తమకు కలిసొస్తుందని బుమ్రా తెలిపాడు. ఇంగ్లీష్ ఆటగాళ్లు బాజ్‌బాల్ ఆటతో తనపై పైచేయి సాధించలేరన్నాడు.
‘బాజ్‌బాల్ ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్‌కు అభినందనలు. టెస్టు క్రికెట్ ఆడటానికి మరో మార్గం ఉందని ప్రపంచానికి తన దూకుడు చూపిస్తోంది. అయితే బౌలర్‌గా ఇది నాకు కలిసొస్తుందని నేను భావిస్తున్నా. ఒక బౌలర్‌గా ఎప్పుడూ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తాను. బాజ్‌బాల్ ఆటతో దూకుడుగా ఆడి నన్ను అలసటకు గురి చేయలేరు. నేను వికెట్లు పడగొట్టి వారికి బదులిస్తాను. మైదానంలోకి దిగిన ప్రతిసారి పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలనేదానిపై ఎక్కువగా ఆలోచిస్తా. నేను బాజ్‌బాల్ గురించి పెద్దగా ఆలోచించట్లేదు’ అని జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌ను హెచ్చరించాడు.
Also Read: Rohit Sharma: ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ! జట్టులో సగం మనోళ్లే
గతంలో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. 2021 ఐదో టెస్టులో జానీ బెయిర్‌స్టో సెంచరీచేయడంతో 83-5 ఉన్న ఇంగ్లండ్.. 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు జస్ప్రీత్ బుమ్రా ఎదురుచూస్తున్నాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ తమ వ్యూహాలతో భారత జట్టును ఓడించేందుకు సిద్ధమవుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో హోరాహోరీ తప్పేలా లేదు. హైదరాబాద్ పిచ్ బయటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మరి ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి.