ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్దమవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ జనవరి 25న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో కఠోర సాధన చేస్తున్నాయి. తమ బాజ్‌బాల్ సిద్ధాంతంతోనే టీమిండియాపై పైచేయి సాధించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయితే బాజ్‌బాల్ భారత పిచ్‌లపై పెద్దగా ప్రభావం చూపదని మాజీలు అంటున్నారు. దీనిపై తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. బాజ్‌బాల్…