IND vs BAN: అశ్విన్ గురించి ఏం చెప్పాలి.. ప్రతిసారీ అతడివైపే చూస్తాం: రోహిత్
- సెంచరీ సహా ఆరు వికెట్స్
- అశ్విన్‌పై రోహిత్ ప్రశంసలు
- విజయం సాధించేందుకు పోరాడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదన్నాడు. వికెట్స్ అవసరమైన ప్రతిసారీ అతడివైపే చూస్తాం అని చెప్పాడు. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు ఎల్లప్పుడూ యాష్ సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. టీఎన్‌పీఎల్‌లో అశ్విన్ బ్యాటింగ్ చేయడం తాము చాలాసార్లు గమనించాం అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో యాష్ సెంచరీ (113)తో పాటు ఆరు వికెట్స్ పడగొట్టాడు.
‘ఆర్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. నా తర్వాత అతడే మాట్లాడుతాడు. అన్నింటికి సమాధానం చెప్పేందుకు అతడే సరైన వ్యక్తి. మేం అతని వైపు చూసే ప్రతిసారీ.. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. అశ్విన్ గురించి చెప్పి తక్కువ చేయలేము. జట్టు కోసం అతడు చాలా చేశాడు. అతడు అద్భుతం. బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. టీమిండియాకు ఆడనప్పుడూ స్థానికంగా జరిగే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ ఆడాడు. అది కూడా కలిసొచ్చే అంశమే. టీఎన్‌పీఎల్‌లో చాలాసార్లు యాష్ బ్యాటింగ్ చేయడం మేం గమనించాం’ అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Also Read: Anasuya Bharadwaj: వామ్మో అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు!
‘టెస్టుల్లో చాలా రోజుల తర్వాత అద్భుత విజయం సాధించాం. చాన్నాళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడినా.. క్రికెట్ నుంచి బయటకు వెళ్లలేదు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాం. వారం ముందే ఇక్కడికి వచ్చాం. అనుకున్నట్లుగానే మంచి ఫలితం రాబట్టాం. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించారు. రిషబ్ పంత్ టెస్టుల్లోకి అడుగు పెట్టి దాదాపు 20 నెలలు అయింది. ఐపీఎల్, ప్రపంచకప్‌లో ఆడినప్పటికీ దులీప్ ట్రోఫీలో ఆడడం ఉపయోగపడింది. గిల్ మళ్లీ టెస్టుల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. జడేజా బాగా ఆడాడు. మేం భారత్‌లో ఆడినా, వెలుపల ఆడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు పోరాడతాం. జట్టును అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నాం’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!