Star Maa: “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.. మొదటి సీజన్ ను సక్సెస్ గా సాగింది. ఇప్పుడు మారోమారు అదే జోష్ తో పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన అందరూ కలిసి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యారు. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. ఇందులో కిరాక్ బాయ్స్, కిలాడి గాళ్స్ హోరా హోరీగా పోటా పోటీగా తలపడబోతున్నారు. ఇది అమ్మాయిలకీ, అబ్బాయిలకీ మధ్య సరదాగా సాగే వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని పోటీ పడుతున్న టీమ్స్ తో కొత్త వార్ “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్” సీజన్ 2 మార్చి 29 న ప్రారంభం కానుంది.
సినిమా, టీవీ రంగాల్లో తమదైన ముద్ర వేసిన సెలెబ్రిటీలు ఈ షో లో రెండు టీమ్స్ గా ఓ ఆట ఆడబోతున్నారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఛాలెంజెస్ తో ఒకరిని మించి మరొకరు సత్తా చూపించడానికి రెడీ ఆవుతున్నారు. గెలుపు కోసం ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను అలరించడానికి అన్ని అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ఈ షో లో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ ఒక్కో స్పెషల్ టాలెంట్ తో ఈ షో కి రాబోతున్నారు. “ఎప్పటికీ.. నో కాంప్రమైజ్ ” అనే యాటిట్యూడ్ తో ప్రతిఒక్కరు ఎదురు టీంతో తలపడబోతున్నారు.
స్మాల్ స్క్రీన్ సంచలనం శ్రీముఖి ఎనర్జిటిక్ గా ఈ రెండు టీముల సమరాన్ని ముందుండి నడిపించబోతున్నారు. ఆర్టిస్టులను, సెలబ్రిటీ లను డీల్ చేయడంలో ఎంతో అద్భుతమైన సమయస్ఫూర్తి తో వ్యవహరించే శ్రీముఖి 16 మంది కంటెస్టెంట్స్ ని, ఇద్దరు లీడర్స్ ని బాలన్స్ చేయబోతున్నారు. ఈ షో లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ “కిరాక్ బాయ్స్” తరఫున లీడ్ చేయబోతున్నారు. ప్రెజెంటర్ గా, నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ “కిలాడి గాళ్స్”కి ప్రతినిధిగా వుంటున్నారు. ఒకసారి గెలిచిన ఆనందంలో, దాన్ని ఈ సారి కూడా రిపీట్ చేద్దాం అనుకుంటున్న “కిరాక్ బాయ్స్”, ఫస్ట్ సీజన్ ఓడిపోయిన అవమానంతో ఈ సీజన్ ఎలాగైనా కొట్టాలి అనే పట్టుదలతో రగిలిపోతున్న “కిలాడి గాళ్స్” మధ్య పోటీ చాలా చాలా ఇంటరెస్టింగ్ గా వుండబోతోంది.
కిరాక్ బాయ్స్ గా ఈ షో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారిలో మానస్, కాస్కో నిఖిల్, బంచిక్ బబ్లూ, పృథ్వి, శివ్, ఇమ్మాన్యుయేల్, దిలీప్, సాకేత్ లు ఉండగా.. కిలాడి గాళ్స్ గా హమీదా, రోహిణి, తేజస్విని మడివాడ, సుష్మిత, లాస్య, శ్రీ సత్య, దేబ్ జానీ, ఐశ్వర్య పోటీ పడబోతున్నరు. 16 మంది సెలబ్రిటీలు ఒకే వేదికపై చేయబోతున్న సందడి, సంబరంతో ఈ షో మార్చి 29 న ప్రారంభం అవుతుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.