ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం అంతా పడుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు పుష్ప 2, దేవర, ఓజి, గేమ్‌ఛేంజర్ లాంటి పెద్ద సినిమాలు రానున్నాయి. ఇకపోతే సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది పెద్ద ప్రశ్నే. దీనికి కారణం ఓ రకంగా ఎన్నికలు కూడా కారణం. వీటి వల్ల సినిమా వారి రిలీజ్ డేట్స్ కూడా మారబోతున్నాయి. ఇక ఇందులో ముందుగా రాబోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అన్ని చిత్ర పరిశ్రమలకి భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Vanga Geetha: ఆయనను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.. పవన్‌కు వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
ఆ తర్వాత ప్రభాస్ కల్కి కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించి కూడా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోనే అయ్యేలా కనపడుతుంది. ఇక మరో నెల రోజుల గ్యాప్ లో సెప్టెంబర్ 27న ‘ఓజి’ తో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా కూడా లేట్ అయ్యేలా కనపడుతోంది. ‘అత్తారింటికి దారేది’ విడుదలైన తేదీన మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘దేవర 1 ‘. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక దసరా వరుసలో నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమా, దేవర, బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలు రిలేస్ కానున్నాయి. ఇక చివరిగా డిసెంబర్ 25న క్రిస్మస్ గిఫ్ట్ గా పోలిటికల్ యాక్షన్ ‘గేమ్ ఛేంజర్’ రూపంలో రానున్నాడు రామ్ చరణ్.