మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించినట్లు తెలుస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి తొలి సింగిల్ ‘రామ… రామ…’ విడుదలైంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిమయ గీతం, సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ఈ సాంగ్స్ విజువల్స్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అదేమంటే ‘రామ… రామ…’ పాటను రూపొందించడానికి మేకర్స్ దాదాపు రూ.6 కోట్లు వెచ్చించారు. కలర్‌ఫుల్‌గా, అత్యంత గ్రాండియర్‌గా తెరకెక్కిన ఈ గీతం విజువల్ విందుగా నిలిచింది.
HIT-3 : ’RRR’ రికార్డు బద్దలు కొట్టిన హిట్-3 ట్రైలర్
నాలుగు భారీ సెట్స్‌లో, 12 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. 400 మందికి పైగా డ్యాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులు ఈ గీతంలో పాల్గొన్నారు. ఈ గీతానికి ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. శంకర్ మహదేవన్ గొంతులోని భక్తిభావం, లిప్సిక సున్నితమైన వాయిస్ పాటకు ప్రాణం పోశాయి. కీరవాణి స్వరపరిచిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. కొరియోగ్రఫీని శోభి మాస్టర్, లలిత శోభి సమర్థవంతంగా రూపొందించారు, చిరంజీవి నాయకత్వంలో డ్యాన్స్‌లు విజువల్ స్పెక్టాకిల్‌గా మారాయి. చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు, ఇద్దరూ స్టాలిన్ (2006) తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. అషికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, అయితే జులై 24, 2025న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.