Onion Juice: మారుతున్న ఈ కాలంలో గాలి, నీరు, ఆహారం ఇలా అని కల్తీ అవుతున్నాయి. సమయం లేక, వంట చేయడం కుదరక జనాలు బయట తిండికి అలవాటు పడుతున్నారు. రకరకాల ఫుడ్ లు అడర్ పెట్టుకుని తింటున్నారు. ఇలా సంపాదించడం కోసం రోజంతా పరుగులు తీస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మానేశారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంచం తిన్న కూడా గ్యాస్ ప్రాబ్లం అని, తట్టుకోలేక మత్రలకు అలవాటు పడుతున్నారు. ఇవన్నీ కాకుండా మంచి ఆరోగ్యం, జీర్ణశక్తి మెరుగ్గా ఉండటం కోసం ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
Also Read: Ambati Rambabu: వారి తప్పిదం, వైఫల్యం వల్లే తిరుపతి ఘటన.. అంబటి సంచలన ఆరోపణలు..
మనందరికీ ఉల్లిపాయ తెలుసు. ఇది ఎలాంటి వంటకైన మంచి రుచిని ఇవ్వడంలో ముందు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఉల్లి లేకుండా వంట చేయరు. అయితే ఉల్లిపాయలో విటమిన్ ‘సి’, ‘బి’ వంటి విటమిన్లు, పొటాషియం,మాంగనీస్ వంటి ఖనిజాలు ఉనందున, ప్రతి రోజు ఉల్లిపాయ రసం తాగితే, రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడతుంది. ఇక చిన్న పిల్లలకి అరుగుదల సరిగా ఉండదు. కనుక, ఎంతో తేలికపాటి ఆహరం పెడతాం. కాని అది కూడా కొంత మంది పిల్లలకి సరిగా అరగక కడుపు నొప్పితో బాధ పడుతుంటారు. అలాంటప్పుడు ఈ ఉల్లిపాయ రసం తాగిస్తే నిమిషంలో ఉపశమనం అందుతుంది.
పూర్వం ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక ఔషధంలా తీసుకునే వారు. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుటకు, గాయాలు త్వరగా మానేందుకు అప్లై చేసేవారు. కానీ, ఇప్పుడు అన్నింటికి మందులు అందుబాటులోకి రావడంతో ఇలాంటి ఇంటి చిట్కాలకు పాటించడం తగ్గించారు. మందులకు అలవాటు పడటం కంటే ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించడం మంచిది అని వైద్యులు కూడా చెబుతున్నారు.