Nandamuri Balakrishna and Sreeleela’s Bhagavanth Kesari Movie Trailer Out: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఈరోజు హన్మకొండలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 51 సెకండ్ల నిడివిగల ట్రైలర్.. బాలయ్యబాబు డైలాగ్‌తో ఆరంభం అయింది. ‘నీకు దండం పెడుతా.. నన్ను ఇడిసెయ్ చిచ్చా’, ‘నన్ను కొట్టే బలవంతున్ని ఆ దేవుడు కూడా తేలేడు’, ‘ఎట్ల పాడిండ్రా..’ డైలాగ్స్ ఆకట్టుఉంటున్నాయి. ఆలస్యమెందుకు భగవంత్ కేసరి యాక్షన్ మీరూచుడండి.
Also Read: Best 5G Smartphones: 15 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. సూపర్ ఫీచర్స్!
భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బేబీ ప్రత్యేక గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ల శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన రెండు పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. భగవంత్ కేసరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.