Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ట్వీట్ చేశారు. ప్రేమలు సినిమా బాగా ఎంజాయ్ చేశా అని, ఓ సినిమా చూస్తూ చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో తనకు గుర్తులేదని అన్నారు.
మంగళవారం (మార్చి 12) రాత్రి మహేష్ బాబు ప్రేమలు సినిమా గురించి ఓ ట్వీట్ చేశారు. ‘ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు కార్తికేయకి ధన్యవాదాలు. సినిమా బాగా ఎంజాయ్ చేశాను. ఓ సినిమా చూస్తూ చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో నాకు గుర్తులేదు. నా కుటుంబం మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. టీమ్‌కి మొత్తానికి అభినందనలు’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.
Also Read: Crime News: బెంగళూరులో దారుణం.. యువతిని వివస్త్రను చేసి ఆపై..!
ప్రేమలు సినిమా మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు మూవీని తెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ అయి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. తెలుగులో కూడా రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి, మహేష్ బాబు రివ్యూలతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది.
Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience… Thoroughly enjoyed it…. Can’t remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!!
— Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024