Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫేక్ వీడియోల ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు పోలీస్ స్టేషన్ లో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉపఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరినట్టు ఫేక్ వీడియో క్రియేట్ చేశాడని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి పైన రఘునందన్ రావు దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ ప్రచారం చేసి గెలవడం రఘునందన్ రావుకు అలవాటు అని తెలిపారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
వెంకట్రామిరెడ్డి పైన ఒక దొంగ వీడియో క్రియేట్ చేసి ఆయన పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బిజెపి వాళ్లు మరింత ఫేక్ వీడియోలు తయారు చేసే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. ‘మే డే’ సందర్భంగా హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కష్టపడి పని చేద్దాం. శ్రమను గౌరవిద్దాం. చెమట చుక్క విలువను కాపాడుకుందాం. అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడుదాం. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు, అతను ఆటోవాలా వంటి క్లాక్ ధరించి ఆటో నడుపుతున్న ఫోటోను షేర్ చేశాడు.
Bomb Threat : ఢిల్లీ నుంచి బెంగుళూరు స్కూళ్లకు పాకిన బాంబు బెదిరింపులు