ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లను మారుస్తున్నప్పటికీ.. ఎస్‌ఆర్‌ఆహెచ్ తలరాత మాత్రం మారడం లేదు. అయితే, కనీసం ఈ ఏడాది సీజన్‌లోనైనా అదరగొడుతుందని భావించిన మరోసారి అభిమానులను ఎస్‌ఆర్‌హెచ్ నిరాశ పరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే మ్యాచుల్లో మాత్రమే గెలిచి ఆఖరి స్థానంతో లీగ్ నుంచి నిష్ర్కమించింది.
Read Also: Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ యాజమాని కావ్యా మారన్ పడే బాధను తాను చూడలేక పోతున్నాని అంటూ వ్యాఖ్యానించారు. తన రాబోయే చిత్రం జైలర్ మూవీ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్‌కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు.
Read Also: Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
అయితే, టీమ్ లో మంచి ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలి.. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోని.. జట్టును మరింత బలపేతం చేయాలని సూపర్ స్టార్ రజినీకాంత్ సూచించారు. కాగా కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఐపీఎల్-2024కు ముందు మరోసారి తమ జట్టును ప్రక్షాళన చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాకు ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను వదులుకోవాలని సన్ రైజర్స్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.