ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్‌డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వేదికగా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్‌లోని 7H స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.
Read Also: Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
ప్రతిభావంతులైన క్రికెటర్లకు చేయూత అందించేందుకు ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ లెవల్‌లో లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థల సీఓఓ పేర్కొన్నారు. ప్రతిభవంతులైన క్రీడాకారులు సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని, లీగ్‌లో ఆడే ఛాన్స్ అందిపుచ్చుకోవాలని తెలిపారు. లీగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన టాప్ ఐదుగురు ఆటగాళ్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల విలువ గల స్కాలర్‌షిప్ ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు చెందిన టాలెంటెడ్ క్రికెటర్లను వెతికి వారిని ప్రోత్సహించేలనే లక్ష్యంతో ఈ లీగ్ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎంఎస్‌డీసీఏ అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బీ డైరెక్టర్ వెల్లడించారు.
Read Also: Viral News: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే.. బాస్ అలా అన్నాడు..!
బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో ఈ టీ20 స్కూల్ లీగ్‌ను జరుపుతున్నట్లు చెప్పారు. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు క్రికెటర్లకు ఆరు నెలల పాటు హైదరాబాద్ లోని ధోని క్రికెట్ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఫ్రాంచైజీ టీమ్ మోడల్‌లో లీగ్ జరుగనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ లీగ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.. రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ ఆగస్టు 17వ తేదీ కాగా.. ఆగస్టు 20న హైదరాబాద్‌లోని ఎంఎస్‌డీసీలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 25న టీమ్ పేర్లు ప్రకటన, ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ చేయనున్నారు. అయితే, ఆగస్టు 27 నుంచి లీగ్ స్టార్ట్ అవుతుందని నిర్వహకులు వెల్లడించారు.