Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- భారత్ నేవీ నౌకను ఢీకొట్టిన పాక్ నేవీ షిప్..
- ఉత్తర అరేబియా సముద్రంలో ఘటన..
- పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inidia-Pakistn: భారత నేవీకి చెందిన యుద్ధనౌకను పాకిస్తాన్ నేవీకి చెందిన నౌక ఢీకొట్టింది. అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో జరిగిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ దౌత్యవేత్తను పిలిపించిన నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్ నౌకాదళ యూనిట్ అంగీకరించలేని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తించింది’’ అని పేర్కొంది. ఈ ఘటనలో భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి రెండు దేశాల మధ్య తొలిసారి ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక సాధారణ నిఘా కార్యక్రమాల్లో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా, పాక్ నేవీకి చెందిన పీఎన్ఎస్ హునాయిన్ కావాలని అడ్డగించినట్లు తెలుస్తోంది. భారత్ నౌక చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పాక్ నౌక తన వేగాన్ని పెంచి, భారత యుద్ధనౌక ముందు భాగం దూసుకువచ్చింది. ఈ క్రమంలో భారత నౌకను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ వ్యవహారాన్ని భారత నేవీ, పాక్ సైన్యంతో ప్రస్తావించింది. గతంలో 2011లో గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఐఎన్ఎస్ గోదావరి, పాకిస్తాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ బాబర్ మధ్య ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
1990 భారత్-పాక్ ఒప్పందాన్ని గుర్తుచేసిన భారత్..
ఈ ఘటనపై భారత్ 1991 నాటి భారత్-పాకిస్తాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 10ని ప్రస్తావించింది. సైనిక విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు, సైనిక దళాల కదలికలకు సంబంధించిన వివరాలను ముందుగాస్తుగా ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం ఉంది. అంతర్జాతీయ జలాల్లో భారత, పాకిస్థాన్ నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు కార్యకలాపాలు నిర్వహించే సమయంలో భద్రతా మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఇరుదేశాల నౌకలు ప్రమాదాలను నివారించేందుకు కనీసం మూడు నాటికల్ మైళ్ల (సుమారు 5.6 కిలోమీటర్లు) దూరం పాటించాలని ఆర్టికల్ 10లో పేర్కొన్నట్లు భారత్ తెలిపింది. హునాయిన్ అనే నౌక పాకిస్తాన్ నేవీలో 2024జూలైలో చేరింది. ఈ నౌకలో యాంటీ-షిప్, యాంటీ-ఎయిర్ ఆయుధ వ్యవస్థలు, వివిధ సెన్సార్లు, టెర్మినల్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!