Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలన రికార్డ్‌లలో కీ హైలైట్ ఏంటంటే దాని ఆరో వారం కలెక్షన్సే. గతంలో బాలీవుడ్ సంచలన చిత్రం ‘ధురంధర్’ ఆరో వారంలో రూ.28.95 కోట్లు రాబట్టి అత్యధిక వసూళ్ల రికార్డును తన పేరిట లిఖించుకుంది. అయితే తాజాగా ‘హనుమాన్ అంశ్’ ఆ మైలురాయిని సింపుల్‌గా దాటేసింది. ఒక్క ఆరో వారంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 64.87 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టి, పాత రికార్డును రెట్టింపు మార్జిన్‌తో బద్దలు కొట్టింది. ఇంకా ఈ వారం పూర్తి కాకముందే ఈ స్థాయి నంబర్స్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను సైతం నివ్వెరపరుస్తోంది.
వీకెండ్లోనే కాకుండా సోమ, మంగళవారాల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. సోమవారం: రూ. 8.00 కోట్లు, మంగళవారం: రూ. 7.80 కోట్ల వసూల్లతో వర్కింగ్ డేస్‌లోనూ ఈ వసూళ్లు సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన ఆదరణను స్పష్టం చేస్తున్నాయి. కంటెంట్‌లోని ఆధ్యాత్మిక లోతు, భావోద్వేగాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా లెక్కలతో కలిపి ఇప్పటి వరకు ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొత్తంగా రూ. 218.03 కోట్ల నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఎదురేలేకుండా సాగుతున్న ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. రన్ బలంగా కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?