Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను చేరుకుని సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అన్ష్’ చిత్రానికి తెలుగు నాట ఊహించని బ్రేకులు పడ్డాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 18న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. కానీ, రిలీజ్‌కు సరిగ్గా కొద్ది రోజుల ముందు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఈ డబ్బింగ్ సినిమా భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన బ్రాండ్ నేమ్ వల్ల తెలుగు మార్కెట్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లాస్ట్ మినిట్ లో డీల్ క్యాన్సిల్ అవ్వడం వల్లే సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జరగాల్సిన భారీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను రాత్రికి రాత్రే రద్దు చేశారు. ఆయన ఎగ్జిట్‌పై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ రాత్రికి రాత్రే కొత్త డిస్ట్రిబ్యూటర్ దొరికినా సినిమా రిలీజ్ అవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులువు కాదు. ‘హనుమాన్ అన్ష్’ తెలుగు వెర్షన్‌కు సెన్సార్ బోర్డు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని, క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో ఉందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం, ప్రెస్ మీట్స్ జరగకపోవడం, ఇప్పటివరకు కనీసం తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ అనిశ్చితి నెలకొంది. కొత్త ప్రెజెంటర్ దొరికి, సెన్సార్ పనులు పూర్తయితే కానీ సినిమా థియేటర్లలోకి రాలేదు. ఒకవైపు వందల కోట్లు కొల్లగొడుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ శుక్రవారమే థియేటర్లలో పడుతుందా? లేక వాయిదా తప్పదా? అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!