Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapido: అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలని బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే అమాయక ప్రయాణికుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ‘రాపిడో’కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. “ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే మీకు రైడ్ దొరుకుతుంది.. లేదంటే లేదు” అనే తరహాలో కస్టమర్లను పరోక్షంగా బెదిరింపులకు గురిచేస్తూ దోపిడీకి పాల్పడుతున్న రాపిడోపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కొరడా ఝళిపించింది. రాపిడో మాతృసంస్థ రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌పై ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది.
యాప్‌లోనే పచ్చి మోసం..
సాధారణంగా రాపిడోలో రైడ్ బుక్ చేసే సమయంలో మొదట ఒక ధరను చూపిస్తారు. తీరా బుకింగ్ ప్రక్రియ మొదలయ్యాక.. “డ్రైవర్లు ఈ ధరకు రావట్లేదు.. రూ.10, రూ.20 లేదా రూ.30 అదనంగా జోడించండి” అంటూ యూజర్లపై ఒత్తిడి తీసుకొస్తారు. అంతేకాకుండా “Higher the price, higher the chance of getting a ride” (ఎక్కువ ధర చెల్లిస్తేనే రైడ్ దొరికే అవకాశం ఎక్కువ) అనే మెసేజ్‌లతో ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారు. యాప్ స్క్రీన్‌పై రంగుల జిమ్మిక్కులతో సైకాలజికల్ గేమ్‌కు తెరతీసినట్లు CCPA విచారణలో తేలింది. ఇంటర్ఫేస్ ఇంటర్ఫెరెన్స్: ‘సెట్ యువర్ ప్రైస్’ ఫీచర్లో ఎక్కువ ఛార్జీని ఎంచుకుంటే స్క్రీన్‌పై పచ్చ రంగు చూపిస్తూ రైడ్ త్వరగా వస్తుందని నమ్మిస్తారు. అదే తక్కువ మొత్తం ఉంచితే ఎరుపు లేదా నారింజ రంగు సంకేతాలు ఇచ్చి భయపెడతారు. యూజర్లు అదనపు మొత్తం ఇవ్వకపోతే తామేదో తప్పు చేస్తున్నామన్న భావన కలిగించేలా మానసిక ఒత్తిడి పెంచుతారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
బుకింగ్ టైమ్‌లోనే ‘టిప్’ దోపిడీ..
మోటారు వాహన నిబంధనల ప్రకారం.. రైడ్ ముగిసిన తర్వాత మాత్రమే కస్టమర్ తన ఇష్టపూర్వకంగా ‘టిప్’ ఇచ్చే వెసులుబాటు ఉండాలి. కానీ, రాపిడో సంస్థ అసలు రైడ్ స్టార్ట్ కాకముందే ప్రయాణికుడిపై టిప్ భారాన్ని మోపుతోందని కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చూపే ఛార్జీల్లో దూరం, ట్రాఫిక్, డ్రైవర్ వాటా అన్నీ కలిసి ఉన్నప్పుడు, బుకింగ్‌కు ముందే అదనపు భారం మోపడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. తమ వాదనలో భాగంగా రాపిడో “ఇది కేవలం ప్రయాణికుల ఇష్టం మాత్రమే” అని తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఎక్కువ డబ్బులిస్తేనే రైడ్ దొరుకుతుందనడానికి కంపెనీ వద్ద ఎలాంటి అధికారిక సాంకేతిక ఆధారాలు లేవని తేలింది.
ఓలా, ఉబర్లకూ చుక్కలు తప్పవా?
ఈ దోపిడీ కేవలం రాపిడోతోనే ఆగలేదు. ఓలా, ఉబర్, నమ్మ యాత్రి వంటి ఇతర ప్రసిద్ధ రైడ్ హెయిలింగ్ సంస్థల యాప్‌లలోనూ ఇలాంటి మోసపూరిత డిజైన్లు (డార్క్ ప్యాటర్న్స్) ఉన్నాయా అనే కోణంలో CCPA ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. వినియోగదారులు ఇలాంటి యాప్‌ల చేతిలో మోసపోతే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1915 కి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అత్యవసర ప్రయాణాల్లో ఉన్న కస్టమర్లను అడ్డంగా దోచుకోవాలనుకునే సంస్థలకు ఈ రూ.10 లక్షల జరిమానా ఒక గట్టి హెచ్చరికగా నిలవనుంది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!