IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2027 Mini Auction in India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో ఐపీఎల్ వేలం విదేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మాత్రం వేదికను భారత్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.
2023లో కొచ్చిలో జరిగిన వేలం తర్వాత ఐపీఎల్ వేలం వరుసగా విదేశీ వేదికల్లో జరిగింది. దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి నగరాలు వేలానికి ఆతిథ్యమిచ్చాయి. అయితే 2027 వేలం మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురయ్యే లాజిస్టికల్, నిర్వహణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వేలం సందర్భంగా ఫ్రాంచైజీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
అయితే ఐపీఎల్ 2027 వేలం ఏ నగరంలో జరుగుతుందో అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఫ్రాంచైజీలు, వారి ప్రతినిధులకు సరిపడే వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే నగరంను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో వివాహాల సీజన్ ఉండటంతో ఫైవ్ స్టార్ హోటళ్లలో గదుల లభ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. బీసీసీఐకి రెండు రోజుల పాటు 100కు పైగా గదులు అవసరమవుతాయని తెలుస్తోంది. హోటల్ అందుబాటును బట్టి వేలం జరిగే నగరాన్ని ఖరారు చేయనున్నారు.
ఐపీఎల్లో కొనసాగుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. నెల రోజుల్లో మరో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరగనుండగా.. అప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భవిష్యత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఇప్పటికే అభిప్రాయాలను కోరింది. చాలా జట్లు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అయితే మరో ఏడాది ఈ నిబంధనను కొనసాగించాలని కొన్ని ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను దృష్టిలో ఉంచుకునే తాము జట్లను నిర్మించామని కొన్ని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అందుకే ఒక్కసారిగా ఈ నిబంధనను తొలగించడం కంటే.. వచ్చే ఏడాది నిర్ణయం తీసుకోవడం సరైనదని భావిస్తున్నారట.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!