HYDRA : హైడ్రా (Hyderabad Water Resources Development and Reclamation Authority) హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను రక్షించి, వాటిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ. ఈ సంస్థ పారిశుద్ధ్య పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, పర్యావరణాన్ని సంరక్షించడం లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందినా అక్కడ అక్రమార్కుల భరతం పడుతున్నారు హైడ్రా అధికారులు. ఈ నేపథంల్యోనే.. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో హైడ్రా కొరడా ఝుళిపించింది. అల్మాస్‌గూడ 5వ డివిజన్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసులు ఈ సమస్యను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి నివేదించారు. గతంలో ఈ ఘటనపై కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోవడం లేదని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న లక్ష్మారెడ్డి, హైడ్రా, మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్‌ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆటపరికరాలను తిరిగి ఏర్పాటు చేశారు. హైడ్రా ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ, ఇతర పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలోనే చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో బడంగ్‌పేటలో భూకబ్జాదారులకు గట్టి హెచ్చరిక వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకొని, పార్కు స్థలాన్ని కాపాడినందుకు వెంకటేశ్వర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాలభిషేకం చేశారు.
Nargis Fakhri Sister: బ్రేకప్ చెప్పాడని కాల్చి చంపిన హీరోయిన్ చెల్లి అరెస్ట్