Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Husband Sought Divorce Because His Wife Not Cooking In Hyderabad

Divorce: పెళ్లైన ఏడాదిన్నరకే.. భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు కీలక తీర్పు

Published Date :January 7, 2026 , 10:05 am
By Venkatesh
  • భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త
  • ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక తీర్పు
  • భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది
Divorce: పెళ్లైన ఏడాదిన్నరకే.. భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు కీలక తీర్పు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య వంట చేయడం లేదని, తనను హింసిస్తుందని పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం..

Also Read:Jaishankar-Venezuela: మదురో కిడ్నాప్‌పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

Also Read

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
Add as a preferred
source on google

ఎల్బీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు భార్య సహకరించడం లేదని, ఇది క్రూరత్వం, హింసించడం కిందికి వస్తుందని కోర్టుకు విన్నవించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చేసిన అభ్యర్థనను కింది కోర్టు గతంలో కొట్టేసింది. సదరు భర్త కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేశారు. దీనిని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని పేర్కొంది.

Also Read:CM Chandrababu: కొత్త పాస్ పుస్తకాలతో రైతుల్లో భరోసా.. ”మీ భూమి-మీ హక్కు” అన్నదాతలకు సీఎం చంద్రబాబు హామీ

వంట చేయకుండా తన తల్లికి సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న భర్త వాదన ఆధారంగా విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. భార్య రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తారని, ఆమె వంట చేయకపోవడం భర్తను హింసిస్తున్నట్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అత్త వంట చేసేప్పుడు భార్య సహకరించకపోవడం హింసించడం కిందికి రాదని తీర్పులో పేర్కొంది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు ఆఫీసు విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 నుంచి 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారని, ఈ పనివేళల నేపథ్యంలో ఉదయం వేళ భార్య వంట చేయడం ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్ని గొడవలు సర్వసాధారణం అని, వాటిని పరిష్కరించుకోకుండా విడాకులు కోరడం సమంజసం కాదని కోర్టు సూచించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cooking
  • Divorce
  • husband
  • hyderabad
  • Telangana High Court

తాజావార్తలు

  • SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?

  • Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions