ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో తిరుగు లేని ఫేమ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని సెట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘కోర్ట్’ మూవీతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నా నాని, ప్రజంట్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హిట్ 3’ ఒకటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న ఈ 3వ బాగంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:Kalyan Ram : ఆమెను నేను అమ్మ అనే పిలుస్తా
కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్‌గా మారుతోంది. అలాగే నాని ‘ప్యారడైజ్’ మూవీ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా ప్రముఖ ఓటిటి సంస్థ డీల్ కుదుర్చుకుందట. సినిమా సినిమాకు నాని డిమాండ్ పెరుగుతుండడంతో ఆయన పట్టిందల్లా బంగారమవుతుంది. దీంతో నాని క్రేజ్ ఓటీటీ పరంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.