Ranbir Kapoor : రణబీర్ కపూర్‌పై మండిపడుతున్న హిందువులు.. పోలీసు కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
మాములుగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నిని ముందుగా ప్రార్దించి అనంతరం పూజను ప్రారంభం చేస్తారు.. కాగా, రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్ధేశపూర్వకంగా క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించారు, జై మాతా ది అని నినాదాలు చేశారని ఫిర్యాదులో ముంబయికు చెందిన సంజయ్ తివారీ పేర్కొన్నారు. తన న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాల ద్వారా ముంబయిలోని ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో నటుడు, అతని కుటుంబ సభ్యుల పై కంప్లైంట్ ఇచ్చారు..
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో హిందువుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినందుకు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యుల పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఇంకా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు కాలేదు. రణబీర్ కపూర్ తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని సంజయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతనికి కొన్ని హిందు సంఘాలు కూడా మద్దతు తెలిపుతుండటంతో ఇప్పుడు ఈ విషయం పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..
Alia Bhatt and Ranbir Kapoor yesterday at Christmas lunch#AliaBhatt #RanbirKapoor pic.twitter.com/uyvLdzQdWy
— Alia’s nation (@Aliasnation) December 26, 2023
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!