టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ‘జీ5 ‘ఓటీటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ హనుమాన్ మూవీని టెలికాస్ట్ చేయనుంది.హనుమాన్ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ను శుక్రవారం (మార్చి 8) కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ కోసం ఓవైపు అభిమానులు వేచి చూస్తుండగా.. సడెన్ గా ఈ ఛానెల్ హనుమాన్ హిందీ వెర్షన్ డేట్ రివీల్ చేసింది. హనుమాన్ మూవీ వచ్చే శనివారం (మార్చి 16) రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది.హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతానికి టీవీలో రానుంది. ఈ విషయాన్ని కలర్స్ సినీప్లెక్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై రాబోతున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి” అని ఆ ఛానెల్ అనౌన్స్ చేయడం విశేషం.
మరోవైపు హనుమాన్ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రి సందర్భంగా ఓటీటీలోకి వస్తుందని ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ‘జీ5’ఓటీటీ మాత్రం కొన్ని గంటల ముందు ట్విస్ట్ ఇస్తూ దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం షాక్ కు గురి చేసింది.గురువారం (మార్చి 7) నుంచి ఆ ఓటీటీ ఇదే మాట చెబుతోంది. ఇప్పటికే కొన్ని వేల మంది అభిమానులు జీ5 అధికారిక ఎక్స్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. హనుమాన్ మూవీ ఎప్పుడు వస్తుంది? హనుమాన్ కోసం వెయిటింగ్? హనుమాన్ పై అప్డేట్ ఇవ్వండి అని ఇలా వరుసగా ట్వీట్ చేస్తున్నారు.దీనిపై జీ5 కూడా స్పందిస్తూనే ఉంది. అయితే వారి సమాధానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. శుక్రవారం (మార్చి 8) రాత్రి ఓ అభిమానికి జీ5 ఇచ్చిన రిప్లై ఇలా ఉంది. “హాయ్. మీ సహనానికి అభినందనలు. ఈ కంటెంట్ పై ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. భవిష్యత్తులో అనౌన్స్ మెంట్స్, ఉత్సాహకరమైన వార్త కోసం మా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కనెక్ట్ అవండి.” అని జీ5 అని బదులిచ్చింది.