భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.