High Court: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వార్తల్లో నిలిచారు.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.. అయితే, దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీగా ఉన్న సమయంలో హత్య కేసులో నిందితుడిగా కేసు నమోదు అయ్యింది.. అయితే, ఈ కేసులో స్టే ఇవ్వాలని దగ్గుబాటి ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. అసలు, పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం..
Read Also: Niranjan Reddy: కాసేపట్లో అంత్యక్రియలు, మాజీ మంత్రి పిలుపు.. పాడే మీది నుంచి లేచొచ్చిన వీరాభిమాని!