Niranjan Reddy: కాసేపట్లో అంత్యక్రియలు, మాజీ మంత్రి పిలుపు.. పాడే మీది నుంచి లేచొచ్చిన వీరాభిమాని!
- వనపర్తి జిల్లా కేంద్రంలో ఊహించని ఘటన
- చనిపోయాడని అనుకుని అంతిమ సంస్కారాలు
- అభిమాన నాయకుడి పిలుపుతో మృత్యువును జయించిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చనిపోయాడని అనుకుని అంతిమ సంస్కారాలు చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేయగా.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తన అభిమానిని కడచూపు చూసేందుకు ఇంటికి వెళ్లారు. పూలమాల వేస్తుండగా బాడీలో కదలికలు వచ్చాయి. ఇది గమనించిన మాజీ మంత్రి.. గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అతడు బతికి బయటపడ్డాడు. తన అభిమాన నాయకుడి పిలుపుతో వీరాభిమాని ఏకంగా మృత్యువునే జయించాడు. మాజీ మంత్రి దేవుడిలా వచ్చి కాపాడారంటూ కుటుంబసభ్యులు కొనియాడారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… వనపర్తికి చెందిన తైలం రమేష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ కారుడు. తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డికి రమేష్ వీరాభిమానిగా మారాడు. నిరంజన్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఛాతీపై ఆయన ఫొటో, పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. హైదరాబాద్‌లో నివసిస్తున్న రమేష్.. మూడు రోజుల కింద వనపర్తిలోని పీర్లగుట్టలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత రమేష్ అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికే స్పృహ తప్పిపోయాడు. అతడిలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబసభ్యులు చనిపోయాడని భావించారు.
Also Read
Also Read: Kaleshwaram Project: సీబీఐ విచారణ జరపండి.. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ!
విషాదంలో మునిగిపోయిన రమేష్ కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అతడిని పడుకొబెట్టి పూలమాలలు వేశారు. మరోవైపు దహన సంస్కారాల కోసం డబ్బులు కూడా ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.. రమేష్‌ను కడచూపు చూసేందుకు ఇంటికి వెళ్లారు. రమేష్‌ను చూసిన మాజీ మంత్రి కన్నీటిపర్యంతం అయ్యారు. అతడి కన్నీటి చుక్కలు రమేష్ గుండెపై ఉన్న పచ్చబొట్టుపై పడ్డాయి. నిరంజన్ రెడ్డి పూలమాల వేసేందుకు ముందుకు వంగటంతో బాడీలో కదలికలు గుర్తించారు. రమేష్.. రమేష్ అంటూ గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తర్వాత రమేష్ కళ్లు తెరిచాడు. నిరంజన్ రెడ్డి సమయస్ఫూర్తికి రమేష్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!