రష్యాలోని డాగేస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన భయానక వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇందులో హెలికాప్టర్ నేలను ఢీకొట్టడంతో దాని తోక భాగం ముక్కలైపోయింది. కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న రష్యన్ డాగేస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి ఇసుక దిబ్బను ఢీకొట్టింది.
ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో హెలికాప్టర్ తోక భాగం విరిగి పోయింది. అయినప్పటికీ, పైలట్ టేకాఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఫలితంగా, హెలికాప్టర్ కొంతసేపు సముద్రంపై తిరుగుతూ బీచ్‌లోని ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి, దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
The video of the Russian helicopter crashed into a house and exploded into a huge fireball leaving four defence plant workers dead. pic.twitter.com/UTMWK3LHvJ
— Shihab (@ShihabudeenMb) November 8, 2025