మండువేసవిలో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగినా.. ఎడతెరిపి లేని వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఏలూరు, చింతలపూడి ,పోలవరం ,తాడేపల్లిగూడెం ,భీమవరం, నరసాపురం కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాల వర్షం రైతులకు భారీ నష్టం తెచ్చిపెట్టే విధంగా ఉంది. చాలా ప్రాంతంలో ధాన్యం కల్లాల్లోనే మిగిలిపోయింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం లో మార్పులు ఆక్వా రైతులు నిండా ముంచుతుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో తెల్లవారుజామునుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరికోతలు ఇంకా పూర్తికాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: Astrology: మే 01, సోమవారం దినఫలాలు
కడప జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజామునుంచి ఎడతెరపి లేని వర్షం పడుతోంది. ప్రధాన రోడ్లు అయిన గాంధీరోడ్డు, శివాలయం వీధి జలమయం అయ్యాయి. తహసీల్దార్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, ఫైర్ కార్యాలయాలలోకి చేరిన వర్షపు నీరుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడజిల్లాలో ఎడ తెరిపి లేకుండా వర్షం పడుతోంది. కాకినాడ, సామర్లకోట, తుని, జగ్గంపేట, రామచంద్రపురం లలో ఈదురుగాలులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులుకి పొలాల్లోనే వరి పంట పడిపోతుందని, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తోడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏలూరు,భీమవరం, పోలవరం ప్రాంతాల్లో భారీ వర్షం..గుంటూరులో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం… ఉరుములు.మెరుపులతో కూడిన వర్షం పడింది. విశాఖ నగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అనంతపురంలోనూ వర్షం పడుతోంది.
Read Also: ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్