దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 124 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ వర్షం శుక్రవారం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర�
దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.
దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం భారీగా వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తర భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడు�
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం వేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. అయితే చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు.
ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.