ప్రేమ అనే రెండక్షరాలు రెండు మనసులను దగ్గర చేస్తుంది. బంధాన్ని ధృడం చేస్తోంది. ప్రేమ బ్రతుకును కోరుకుంటుంది. చావును కాదు. కానీ బెంగళూరులో ఓ ప్రియుడు.. ప్రియురాలి చావును కోరుకున్నాడు. అతడి ప్రతిపాదనకు నో చెప్పినందుకు ప్రియురాలిని ఏకంగా పైకి పంపించేశాడు.
42 ఏళ్ల మహిళ.. 32 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియురాలి ముందు ప్రియుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రేకుడైన ప్రియుడు.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. దాదాపు 15 సార్లు ఆమెను పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం 8:30 గంటలకు నగరంలోని షాలినీ గ్రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
పశ్చిమబెంగాల్‌కు చెందిన 42 ఏళ్ల ఫరీదా ఖాతున్.. తన భర్తతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటూ స్పాలో ఉద్యోగం చేస్తోంది. గిరీష్ అనే క్యాబ్ డ్రైవర్‌తో 10 ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ నడుస్తోంది. దీంతో ఫరీదా ఖాతున్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల ఫరీదా భర్త మృతిచెందాడు. అనంతరం ఫరీదాతో గిరీష్ రిలేషన్ మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆమె ముందు పెళ్లి ప్రసావన తీసుకొచ్చాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 15 సార్లు పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపాయాడు.
ఇది కూడా చదవండి: Samantha: ఊహించని పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టిన సామ్.. ఇక ఆగేదేలే!
నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ డీసీపీ శివప్రకాష్ దేవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. పదేళ్ల నుంచి ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని.. ఎప్పుటి నుంచో అతడు పెళ్లి ప్రస్తావన తెస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయన్నారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన తేగా.. ఆమె అందుకు నిరాకరించడంతో చంపేశాడని డీసీపీ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Divine Message 1: ఇస్కాన్‌పై సుబ్రమణ్యపురం దర్శకుడి “డివైన్ మెసెజ్ 1” !