Supreme Court: తెలంగాణలో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టింది అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, మరో రెండు బిల్లులను ప్రభుత్వ పరిశీలన కోసం వెనక్కి పంపినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వాటిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Read Also: KTR: త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ
ఈ తరుణంలో గవర్నర్ తమిళిసై మూడు బిల్లులను ప్రభుత్వ అధికారుల నుంచి వివరణ తీసుకుని ఆమోదం తెలిపారు. మరో రెండు బిల్లులను తిప్పి పంపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులను పెండింగ్‌లో ఉంచారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీం విచారణపై ఉత్కంఠ నెలకొంది.