Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రజా.. తమ జట్టు బౌలర్లు అక్కడక్కడా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ప్రతిభ, వారు ఆడిన షాట్లు నిజంగా ప్రశంసనీయమని కొనియాడాడు. ఫీల్డింగ్ విభాగంలో తాము మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని రజా అభిప్రాయపడ్డాడు. ‘ఫీల్డర్లు గనుక బౌలర్లకు కొద్దిగా మద్దతుగా నిలిచి ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. కానీ, భారత బ్యాటర్ల శ్రమను తక్కువ చేసి చూపలేం. ముఖ్యంగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మల ఆటతీరును చూసి మేమంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని పేర్కొన్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి నిలకడగా రాణించడం చాలా కష్టమని, కానీ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ దాన్ని సులువుగా చేసి చూపాడని మెచ్చుకున్నాడు.
220 పరుగుల భారీ లక్ష్య ఛేదనపై స్పందిస్తూ.. ‘మేము ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఛేదించాలనే మైండ్‌సెట్‌తోనే బరిలోకి దిగాం. మా ఓపెనర్లు ఆరంభంలో మంచి పునాదే వేశారు. అయితే అనుభవలేమి, సరికాని షాట్ సెలెక్షన్ కారణంగా వరుసగా వికెట్లు కోల్పోయి దెబ్బతిన్నాం. కానీ అందరికంటే ఎక్కువగా కెప్టెన్‌గా బ్యాటింగ్‌లో నేనే జట్టును నిరాశపరిచాను. నా నుంచి జట్టు పరుగులు ఆశిస్తోంది. గత రెండు టీ20 మ్యాచ్‌ల్లో నేను బ్యాట్‌తో రాణించలేకపోయాను, ఈ ఓటమికి ఆ బాధ్యత నాదే. తర్వాతి మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని రజా స్పష్టం చేశాడు.
Also Read
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!