పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది పెరుగును తింటారు.. రుచిగా ఉంటుంది. పెరుగుతో తిననిదే కొందరికి భోజనం చేసినట్టుగా కూడా ఉండదు.. పెరుగును భోజనంతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.. రాత్రి పెరుగును తీసుకుంటే ఉదర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే మధ్యాహ్నం తీసుకుంటారు.. ఇలా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి బరువు పెరగకుండా అదుపు చేయడంలో పెరుగు మనకు సహాయపడతుంది. పెరుగును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ముఖ్యంగా స్త్రీలు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల యోని ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి.. కొన్ని వైరస్ ల వచ్చే వ్యాధులు ల నుంచి పెరుగు కాపాడుతుంది.. బీపిని కంట్రోల్ లో ఉంచుతుంది.. తక్షణమే శక్తిని ఇస్తుంది..
పెరుగును తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఈ విధంగా పెరుగు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని దీనిని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పెరుగును ఒక్కొక్కరు ఒక్కో సమయంలో తీసుకుంటూ ఉంటారు.. అయితే మధ్యాహ్నం తీసుకుంటే రోజంతా బాగుంటారని నిపుణులు చెబుతున్నారు.. చర్మ, జుట్టు రక్షణలో కూడా పెరుగు భేష్ గా ఉపయోగ పడుతుంది.. ఇంకా ఎముకలు, దంతాల రక్షణలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.