Moong Dal: మన శరీరంలో విటమిన్లు సరిగా లేకపోవడం వల్ల చాలా మందికి పోషకాలు సమకూర్చుకోవడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే, మీరు తీసుకునే ఆహారంలో పెసలు చేర్చుకుంటే మీరు శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందించవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు.. పెసలు శరీర అభివృద్ధికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ పెసలు చాలా ఫాయిడా కలిగిన పప్పులలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా కాపర్ వంటి పోషకాలు వున్నాయి. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రొటీన్, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి, ఆకుపచ్చ పెసళ్లను తినడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. ముఖ్యంగా వీటిని ఉడికించి తింటే, శరీరానికి కావలసిన పోషకాలు మరింత సమృద్ధిగా అందుతాయి.
Also Read: Daaku Maharaaj: తమన్ అరాచకం అయ్యా.. నెక్స్ట్ లెవెల్ అంతే!
ఇక ఉడకబెట్టిన పచ్చ పెసలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఉడకబెట్టిన మూంగ్ పప్పులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇవి బాడీ బిల్డర్లకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా సన్నగా ఉండి కండలు పెంచుకోవాలనుకునే వారికి కూడా ఉడకబెట్టిన పెసలు తింటే ప్రభావం ఉంటుంది.
Also Read: UNIKA Book Release Event: ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం!
పచ్చ పెసలు మెదడు బూస్టర్ గా బాగా పనిచేస్తాయి. ఇవి మీ నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. వీటిలో ఉండే ప్రోటీన్ మీ హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఉడకబెట్టిన పెసలులో ఉన్న ఫైబర్ కారణంగా.. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది. ఇంకా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.