తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. భాగ్యనగరంలో బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండిసంజయ్‌కుమార్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్‌ఎస్ నేత బోయిన్ పల్లి వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
READ MORE: Daaku Maharaaj: ఇది కదయ్యా బాలయ్యకి పర్ఫెక్ట్ నార్త్ ఎంట్రీ
సందర్భానుసారం పార్టీల ఐఖ్యతను అన్ని పార్టీల నాయకులూ ప్రశంసించారు. చాలా పనులు మానుకొని ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డిని అందరూ ప్రశంసించారు. “పాలక పక్షానికి ప్రతిపక్షానికి అంత వ్యాత్యాసం లేదు.. ప్రజా సమస్యలపై కొట్లాడతాం.. కక్షల పెంచుకోవద్దు. జాతీయ పథకం ఎలాగైతే రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా అన్ని పార్టీల నాయకులతో రెపరెప లాడుతోంది.” అని విద్యాసాగర్ రావు అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్ష మంత్రితో మాట్లాడి ఎలా పని చేశారో మాజీ గవర్నర్ గుర్తు చేశారు. పార్టీల ఐఖ్యతను కొనియాడారు.
READ MORE: Danam Nagender: “కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు”.. నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది..
ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు మాట్లాడారు. గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “ఎలాంటి అరమరికలు లేకుండా పుస్తక ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషం. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వారితో కలిస్తే అనుమానాలు వస్తాయి… ఉంటారా? పోతారా? అని అనుకుంటారు. నన్ను మొదటి సారిగా కారులో తీసుకెళ్లింది విద్యాసాగర్ రావు. ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్య మనస్పర్థలు రాలేదు. గోదావరి నీళ్ళను వాడుకోవడానికి ఇంకో ప్రాజెక్ట్ ను తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. లిఫ్ట్ కాకుండా లాడర్ సిస్టమ్ లో వెళ్తే బాగుంటుంది.” అని పేర్కొన్నారు.
READ MORE: UNIKA Book Release Event: ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం!
ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి పక్షం, పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. “సభలో పాలక పక్ష నేతకు ఎంత ప్రాధాన్యం ఉండేదో ప్రతి పక్ష నేతకు అంతే ప్రాధాన్యం ఉండేది… కాల క్రమేణా ఆ స్ఫూర్తిని కోల్పోయాం.. సభలో ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష సభ్యున్ని మేము సస్పెండ్ చేయలేదు. గోదావరి పై నిర్మించిన ప్రాజెక్ట్ ల గురించి అందరికీ తెలుసు. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి అవసరం. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. వారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే నా ధ్యాస ఉంటుంది. దేశ అభివృద్ధికి తెలంగాణ నుంచి వన్ ట్రిలియన్ ఎకానమీ అందిస్తానని మోడీకి చెప్పా. అందుకోసం కేంద్ర సహకారం కావాలని కోరా. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, హైద్రాబాద్ మెట్రో పొడిగించాలని కోరా. డ్రై పోర్ట్ అనుమతి కావాలని విజ్ఞప్తి చేశా. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సహకరించాలని విన్నవించా. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ మంజూరు చేశారు.. పనులు వేగవంతం చేయాలి. ప్రపంచంతో పోటీ పడాలని అంటే బండి సంజయ్ మెట్రో రైల్ పొడిగింపు విస్తరణ కోసం అనుమతి తేవాలి.. తమిళనాడులో అన్ని పార్టీలు ఒక్కటై పని చేస్తాయి.. జల్లి కట్టుపై అన్ని పార్టీలు ఒకట అయ్యాయి.. స్టేట్ ఇష్యూలపై అన్ని పార్టీలు ఇక్కడ కూడా కలిసి పని చేద్దాం.” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.