బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది అని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి తమన్ ప్రాణం పెట్టి పనిచేసాడని, బాలకృష్ణ ఎలివేషన్స్ సీన్స్ లో కానీ ఇంట్రడక్షన్ సీన్ లో కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి గూజ్ బంప్స్ వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒకచోట తమన్ అందించిన సంగీతం దెబ్బకు స్పీకర్లు కాలిపోవడంతో షో మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Top Headlines @1PM: టాప్ న్యూస్!
దీంతో బాలకృష్ణ అభిమానులు తమనే తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అది సరదాగానే అయినా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో ఈ ఘటనలతో అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ గారికి తాను మ్యూజిక్ కొడితే ఇలాగే ఉంటుందని స్పీకర్లు కాలిపోతున్నాయి అంటే తనకు సంబంధం లేదని ఇప్పటికే తమన్ ప్రకటించారు. తమ ఇద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందంటే ఇక మీదట స్పీకర్లు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఏదేమైనా తమను బాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ సినిమాకి అరాచకం అని అదే పని ప్లస్ పాయింట్ అని అంటున్నారు సినిమా చూసినవారు.