HBD Nandamuri Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ నేడు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన తండ్రికి తగ్గ తనయుడిగా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలయ్య బాబు డైలాగ్, యాక్షన్, కామెడీ, డాన్స్, పాటలు పాడడం అబ్బో.. ఇలా ఎన్ని చెప్పుకున్న తక్కవే. మొత్తానికి అయన ఓ అల్ ఇన్ వన్ ఎంటర్టైనర్.
Read Also: ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!
1974లో వచ్చిన “తాతమ్మ కల” సినిమా ద్వారా బాలయ్య బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి విజయాన్ని ‘మంగమ్మగారి మనవడు’ చిత్రంతో అందుకుని పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి ఎన్నో విభిన్న శైలుల చిత్రాల్లో నటించి తన వేర్సటిలిటీని నిరూపించుకున్నారు. ముఖ్యంగా 1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ సినిమా బాలయ్యకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, పవిత్ర ప్రేమ వంటి చిత్రాలు కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాయి.
బాలకృష్ణ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రం సమరసింహా రెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. అయితే 2004 తర్వాత కొన్ని వరుస ఫ్లాపులతో బాలయ్య కెరీర్ కాస్త స్లో అయ్యింది. కానీ 2010లో వచ్చిన సింహా మూవీతో మళ్లీ బలంగా తిరిగి వచ్చారు. ఆ తరువాత వచ్చిన లెజెండ్ మరో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో బాలయ్య మరోసారో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు బాలకృష్ణ 109 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో తాజాగా విడుదలైన అఖండ 2 టీజర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది.
Read Also: Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. అది ఫ్యాక్టరీలో ప్యాక్ చేశారు.. నేను తయారు చేయలేదు
ఇకపోతే, బాలకృష్ణ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ బాలయ్య సత్తా చాటారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి, 2014 నుండి హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల మనసులను గెలుచుకుని ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నారు. బాలయ్య మరో ముఖ్యమైన పాత్ర బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా కొనసాగుతుంది. అక్కడ ఆయన అందిస్తున్న సేవలు వర్ణించలేనివి. ఇక ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించడం ఆయన జీవితంలో మరో గౌరవదాయకమైన ఘట్టంగా నిలిచింది. తెరపై అద్భుత నటన, తెర వెనుక మానవత్వంతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.