సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామం కేసీఆర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం, కావేరి భాస్కర్ రావు చారిటబుల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు మంత్రి హరీష్ రావు. శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు కేసీఆర్ పాములపర్తి మీద కొండపోచమ్మ సాగర్ ని పెట్టిండని ఆయన కొనియాడారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం మన అదృష్టమన్నారు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన పేదల బతుకు మారలేదన్నారు. కేసీఆర్ వచ్చాక పేదల బతుకు మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Kajal Agarwal : తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన కాజల్ అగర్వాల్…
సద్ది తిన్న రేవు తలవాలన్నారు హరీష్ రావు. ఏ అవ్వను అడిగిన పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాక మాకేం అవుతుంది అంటున్నారన్నారు. ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా, ఒక పైసా ఖర్చు పెట్టకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్ స్థాయిలో కావేరి సీడ్స్ చారిటబుల్ సౌజన్యంతో నిర్మించిన ఇళ్లను పొందిన లబ్ధిదారులు చాలా అదృష్టవంతులన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయలు ఇవ్వగా మరో రూ.11.50 లక్షలు ఖర్చు చేసి కావేరి సీడ్స్ భాస్కర్ రావు అద్భుతంగా 35 ఇళ్లను నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఇళ్లను నిర్మించిన కేసీఆర్ కు, కావేరి భాస్కర్ రావుకు లబ్ధిదారులు రుణపడి ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read : IND Squad for WI Tour 2023: రోహిత్, కోహ్లీ, షమీ ఔట్.. వెస్టిండీస్‌తో ఆడే భారత టెస్ట్ జట్టు ఇదే!