ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై.. బీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జేపీనడ్డా వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రాస కోసం నడ్డా ప్రాకులడినట్లు కరీంనగర్ సభలో అర్థం అయ్యిందని, స్వచ్చంధంగా పదవీ విరమణ చేసే వరకు బీఆర్‌ఎస్‌కు తిరుగు లేదని అన్నారు. 18 కోట్ల ఉద్యోగాలు ఏవి? విదేశాల నుంచి నల్లధనం తెస్తా మన్నారు ఎంత తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని కాకుండా పెట్టుబడిని రెట్టింపు చేశారని, దేశ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. కోట్ల కొలువులు, లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చారో నడ్డా చెప్పాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా హామీలను నెరవేర్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ హరీస్ రావు కొనియాడారు. రైతులకు రైతుబందు ఇచ్చాము.. రైతు బీమా కల్పిస్తున్నామని, దేశానికి మార్గదర్శిగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణ పని తనానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనమన్న హరీష్ రావు.. కేసీఆర్ కిట్ ఫలితాలు అద్భుతమన్నారు.
Also Read : Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కానీ బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోంది..
ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్… ప్రతి నిమిషం ఏ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన చేసే వాళ్ళు మీరు. ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నాం. మీలా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కలేదు. హిమాచల్ ప్రదేశ్ లో నడ్డా బొక్కా బోర్ల పడ్డావ్. నీ రాష్టాన్ని నువ్వు సక్క దిద్దుకో.. జాతీయ అధ్యక్షుడు స్థాయిలో నడ్డా మాట్లాడలేదు. మునుగోడులో ఓడిపోయినా నడ్డాకు జ్ఞానోదయం కాలేదు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు అయ్యింది. ఆ శిలాఫలకం బిజెపిని వెక్కిరిస్తుంది. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించింది. ఇందులో ఇంకా భయపడేది ఏముంది. ఇంకా అధికారికంగా నిర్వహించేది ఏంది? ధరణి వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పట్టా పాసుబుక్ పోస్టులో వస్తుంది. ఇది ఆషామాషీ అడ్డ కాదు… పోరాటాల గడ్డ. కేంద్ర మంత్రి తెలంగాణను అవమానించారు. హిందీ రాదని వెక్కిరించారు. అన్ని పారమిటర్ ల్లో తగ్గుతూ పోతుంది దేశం…. ఏ అంశంలో చూసినా పారమిటర్ లలో తెలంగాణ పెరుగుతూ పోతుంది. మేము ఏమి చేయకపోతే మా పథకాలు ఎందుకు కాపీ కొడుతున్నారు?’ అని హరీష్ రావు అన్నారు.