Rahul Gandhi: దేశ సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ మాత్రమే చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దానిని అంగీకరించడం లేదన్నారు. డ్రాగన్ యుద్ధానికి కాలు దువ్వుతుంటే.. బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నా.. కేంద్రం నిద్రపోతోందని ఆరోపించారు.”ప్రస్తుత పరిస్థితిని బట్టి చైనా చొరబాటుకు సిద్ధపడటం లేదు, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడుతోంది. ముప్పు స్పష్టంగా ఉంది, కానీ మన ప్రభుత్వం బెదిరింపును విస్మరిస్తోంది. కేంద్రం మన నుంచిస్తవాలను దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాలను ఎక్కువ కాలం దాచలేం” అని రాహుల్ గాంధీ అన్నారు.
చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. చైనా తీరు చూస్తే వారు లడఖ్, అరుణాచల్ వైపులా సన్నాహాలు చేస్తున్నారు, కానీ భారత ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 300 మందికి పైగా చైనా సైనికులు 17,000 అడుగుల శిఖరానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. భారత పోస్ట్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించారు, అయితే వారి ప్రయత్నాలను భారత వైపు బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ఘర్షణ జరిగిన వెంటనే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ యాత్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ప్రస్తుతం ఈ యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్ర దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల వ్యవధిలో 3,570 కిలో మీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి బయలుదేరిన యాత్రలో దాదాపు 2,600 కి.మీలను పూర్తి చేసింది. రాజస్థాన్‌ను కవర్ చేసిన తర్వాత, యాత్ర డిసెంబర్ 21న హర్యానాలోకి ప్రవేశిస్తుంది.
#WATCH | China is preparing for war, but our government is not accepting it, it is hiding this fact: Congress MP Rahul Gandhi, at Jaipur, Rajasthan pic.twitter.com/6K1gAdvaY6
— ANI (@ANI) December 16, 2022