ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు మంత్రి హరీష్ రావు. కేంద్రం 9ఏళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతున్నదన్నారు. మనకు కావల్సింది కమిటీ కాదు బిల్లు పెట్టాలి. మా బి ఆర్ ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామన్నారు హరీష్ రావు.
Also Read : Bharatha Chaitrayna Yuvajana Party : ఘనంగా భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
ఇన్నేళ్లు గుర్తు రాలేదు ఎన్నికలు ఉన్నాయని మాట్లాడటం మీ స్థాయికి తగదన్నారు. ఇప్పటికైనా మాకు రాజకీయాల కంటే వర్గీకరణ ముఖ్యమన్నారు. బిల్లు పెట్టాలి తక్షణమే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేడు రాష్ట్రంలో 6652మంది విద్యార్థులు గురుకులాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ కు మారిన గురుకుల పాఠశాలలను త్వరలో డిగ్రీ కి అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. విదేశీ చదువులకు గత ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోతే కేసిఆర్ సీఎం అయ్యాక 20లక్షల రూపాయలు ఇచ్చి చదివిపిస్తున్నారని కొనియాడారు. ఏడాదికి 4వేల కోట్లు రూపాయలు గురుకుల విద్యార్థుల కోసం ఖర్చు అవుతుందన్నారు.
Also Read : BJP vs Congress: ‘కమాన్ టీం ఇండియా’ అంటూ బీజేపీ.. జీతేగా “ఇండియా” అంటూ కాంగ్రెస్ కౌంటర్..